టిమ్ కుక్ వేతనం తగ్గించిన యాపిల్..

 

యాపిల్‌ సీఈవో టిమ్ కుక్ వేతనంలో కోతపడింది. 15 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్‌ అమ్మకాలు పడిపోవడంతో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెప్టెంబర్‌ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆయనకు 8.7మిలియన్‌ డాలర్లు (రూ.59.3కోట్ల) చెల్లించినట్లు రెగ్యులేటరీకి యాపిల్‌ తెలియజేసింది. అంతకు ముందు సంవత్సరం ఆయనకు దాదాపు 10.3మిలియన్‌ డాలర్లు (రూ.70 కోట్లు) చెల్లించారు.  ఈ తగ్గింపు దాదాపు 15శాతం వరకు ఉండవచ్చని అంచనా. 2007లో ఐఫోన్‌ వచ్చిన తర్వాత ఆదాయాలు పడిపోవడం ఇదే తొలిసారి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu