అమ్మో ఎన్ని డైనోసార్ గుడ్లో

 

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు భూమిపై ఉండేవని విన్నాం. అప్పుడప్పుడు వాటి తాలూకూ శిలాజాలు కూడా బయటపడుతుంటాయి. మళ్లీ ఇప్పుడు చైనాలో వాటి గుడ్లు బయటపడ్డాయి. చైనాలోని గువాండ్ డాంగ్ ప్రావిన్స్ లో హేయువాన్ అనే నగరంలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరగుతుండగా ఈ డైనోసార్ల గుడ్ల శిలాజాలు బయటపడ్డాయి. మొత్తం 43 గుడ్లు లభించగా, వాటిలో 19 గుడ్లు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదని చైనా అధికారు తెలిపారు. ఇప్పటివరకు 10,008 డైనోసార్ల గుడ్లను హేయువాన్ మ్యూజియం భద్రపరిచింది. ఇందుకుగాను ఈ మ్యూజియం 2004 గిన్నీస్ రికార్డు కూడా దక్కించుకుంది.