తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(సెప్టెంబర్ 18)  శ్రీవారిని 62వేల 745 మంది దర్శించుకున్నారు. వారిలో 24వేల 451 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల పది లక్షల రూపాయలు వచ్చింది.

ఇక మంగళవారం (సెప్టెంంబర్ 19) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. 

ఇలా ఉండగా  ఏపీ సీఎం జగన్ మంగళవారం (సెప్టెంబర్ 19) తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు, అర్చకును సంప్రదాయబద్ధంగా మంగళవాద్యాలు, వేద మంత్రాల నడుమ ఇస్తికాపాల్ స్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు.  

శ్రీవారి దర్శనం అనంతరం జగన్ కు రంగనాయకుల మండపం వద్ద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. తరువాత టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జగన్ కు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించారు.  ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు జగన్ వెంట ఉన్నారు.