తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు.

వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఆదివారం(మే28) నాడు తిరుమల దేవుడిని 78వేల 818 మంది దర్శించుకున్నారు. 39 వేల 76 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (మే29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానిని 24 గంటల సమయం పడుతోంది.