ఆయన క్కూడా బలుపెక్కువేనట

 

చిత్ర సీమలో అత్యంత సీనియర్ అయిన దాసరి నారాయణ రావు ఏ కార్యక్రమానికి హాజరయినా ఏదో ఒక అంశం మీదనో లేక పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తుల మీదనో తనదయిన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఆయన ఇప్పుడు అటువంటి విమర్శలకి స్పెషలిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. అందువల్ల ఆయన కార్యక్రమాలలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఆ కారణం వల్ల కూడా కొందరు నిర్వాహకులు ఆయనను తమ కార్యక్రమాలకి ఆహ్వానిస్తుంటారు.

 

ఇటీవల రవి తేజ నటించిన బలుపు సినిమా ఆడియో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నిర్మాతల చేతిలో దర్శకులు నటులు ఉంటే, ఇప్పుడు దర్శకులు, నటుల చేతిలో నిర్మాతలు కీలు బొమ్మలుగా మిగిలిపోతున్నారన్నారు. సినీ రంగంలో కొందరు వాపును చూసి బలుపని భ్రమిస్తుంటారని, కానీ తనకున్నంత బలుపు మరెవ్వరికి లేదని అన్నారు. అది సినీ రంగాన్ని శాసిస్తున్నకొందరు పెద్ద హీరోల కొడుకులు మరియు పెద్ద నిర్మాతలు దర్శకులను ఉద్దేశించి అన్నవే. అయితే, ఇటువంటి డైలాగులు పేల్చడం వల్ల ఆయనకి కానీ, చిత్ర సీమకి గానీ ఒరిగేదేమీ లేకపోగా ఆయన కోరుండి తన చుట్టూ శత్రువులను సృష్టించుకొంటున్నారు. అయితే, చిత్ర సీమలో మారినపరిస్థితులకి, ప్రజల అభిరుచిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇప్పటి తరం దర్శకులు, నటులు, నిర్మతలతో పోటీ పడుతూ విజయవంతమయిన సినిమాలు తీయలేనప్పుడు ఆయన ప్రస్తుతం ఇంతకంటే చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.