కాళేశ్వరంపై ఐఏఎస్ అధికారుల క్రాస్ ఎగ్జామ్  18నుంచి ... 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టేందుకు నియమించిన జస్టిస్ పిసిఘోష్ కమిషన్ ఈ నెల 18 నుంచి ఐఏఎస్ అధికారులను క్రాస్ ఎగ్జామ్ చేయనుంది.  బిఆర్ కె భవన్ లో  తెలంగాణ  మాజీ సిఎస్ సోమేష్ కుమార్ తో బాటు ఐఏఎస్ అధికారులైన స్మితా సబర్వాల్, రజత్ కుమార్, కె. రామకృష్ణారావ్  వి. నాగిరెడ్డి, ఎస్ కె జోషి తదితరులను కమిషన్ ప్రశ్నించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడానికి గల కారణాలను కమిషన్ విచార చేపట్టింది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ప్రాజెక్టు బీటలువారడంతో బిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెదిగడానికి నిలిచిన కారణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి.