అభివృద్ధిలో పోటీపడడానికి సిద్దం: బాబు
posted on Aug 9, 2014 2:12PM
.jpg)
విద్వేషాలు ఎంత రెచ్చగొట్టినా తెలుగుజాతిని రక్షించే శక్తి తెలుగుదేశానికి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ...వివాదాలు మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. అభివృద్ధిలో పోటి పడాలని కేసీఆర్ అన్నారని, అభివృద్ధిలో పోటీ పడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బాబు తెలిపారు. అభివృద్ధి అంటే ఏంటో హైదరాబాద్ లో చేసి చూపించానని సీఎం తెలిపారు. కాంగ్రెస్ చేసిన విభజనతీరువల్ల రెండు రాష్ట్రాల్లో కష్టాలు పెరిగాయని ఆరోపించారు. విభజనలో హేతుబద్ధత లేకపోవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు నష్టం జరిగిందని అన్నారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి కూర్చుని చర్చిద్దామని చంద్రబాబు కేసీఆర్ కు సూచించారు.