టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ షాక్
posted on Dec 20, 2025 7:58PM

హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ ఊహించని షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో పెద్ద ఎత్తున బదిలీలు జరగడంతో సంచలనం సృష్టించాయి. ఎస్సై స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు వివిధ ర్యాంకులకు చెందిన అధికారులను టాస్క్‌ఫోర్స్ నుంచి అటాచ్‌మెంట్‌పై ఇతర విభాగాలకు పంపించారు.
కొన్నేళ్లుగా టాస్క్‌ఫోర్స్‌లోనే కొనసాగుతూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిం చాయి. ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకు న్నాయి.
ప్రత్యేకంగా ఒక కేసులో నిందితుడిని తప్పించేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. ఈ వ్యవహారం శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చే స్థాయికి చేరిందని భావించిన హైదరాబాద్ సిపి సజ్జనార్, టాస్క్‌ఫోర్స్‌లో సమూల మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టాస్క్‌ఫోర్స్‌ను మరింత పారదర్శకంగా, సమర్థంగా పనిచేసే విభాగంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ బదిలీలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సీపీ అవినీతి ఆరోపణల పై అంతర్గత విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామంతో టాస్క్‌ఫోర్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.