కపిల్ మిశ్రాపై ఆప్ ఎమ్మెల్యేల దాడి..


ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై ఆప్ బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కపిల్ మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీకి వెళ్లిన కపిల్ మిశ్రా అక్కడ కూడా.. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రాపై దాడి చేశారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో మార్షల్స్ కపిల్ మిశ్రాను  అసెంబ్లీ నుండి బయటకు పంపేశారు. అనంతరం బయటకు వచ్చిన కపిల్ మిశ్రా ఆప్‌ గుండాలు తనపై దాడికి యత్నించారని, కేజ్రీవాల్‌ బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు. సభలో తనకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై తాను మాట్లాడుతుండగానే ఆప్‌ ఎమ్మెల్యేలు దూసుకు వచ్చి, దాడి చేయడమే కాకుండా, పిడిగుద్దులు గుద్దారన్నారు. తనపై దాడి చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నవ్వుతున్నారని, అలాగే డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఆప్‌ ఎమ్మెల్యేలకు డైరెక్షన్‌ ఇస్తున్నారని కపిల్‌ మిశ్రా ఆరోపించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu