కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు.. ముహూర్తం ఖరారు

 

ముందస్తుకు వెళ్లిన వారు ఇప్పటివరకు గెలిచిన దాఖలాల్లేవు.. కానీ కేసీఆర్ మాత్రం ముందస్తుకు సై అంటున్నారు.. ముందస్తులో గెలిచి చరిత్ర సృష్టించడానికి ముందడుగు వేస్తున్నారు.. ఇప్పటివరకు అధికారంగా ప్రకటించలేదు కానీ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.. అయితే అసెంబ్లీ రద్దు కోసం ముహూర్తం కూడా ఖరారు అయినట్టు తెలుస్తోంది.. కేసీఆర్ గురువారం ఉదయం 6.45 నిముషాలకు అసెంబ్లీని రద్దు చేసిన తరువాత గవర్నర్ వద్దకు వెళ్ళనున్నారని సమాచారం.. ఇది కేసీఆర్ జాతకరీత్యా పెట్టిన ముహూర్త బలంగా తెలుస్తోంది.. కేసీఆర్ లక్కీ నెంబర్ అయిన ‘6’ను ప్రామాణికంగా తీసుకుని, డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారట.. 6వ తేదీ, ఉదయం 6.45 నిముషాలు అంటే టోటల్ కూడా 6 కావడంతో ఇలా ముహూర్తాన్ని సిద్ధం చేసినట్లుగా సమాచారం.. మరి ఈ ముహూర్త బలం, ముందస్తు మీద క్లారిటీ రావాలంటే రేపటివరకు వేచి చూడాల్సిందే.