మా బాధ్యత మరింత పెరిగింది.. అసత్య ప్రచారం తగదు..కేసీఆర్
posted on Nov 24, 2015 4:14PM
వరంగల్ ఉపఎన్నిక విజయం చారిత్రాత్మకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో దయాకర్ గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఘన విజయం అందించిన వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ విజయంతో మా బాధ్యత మరింత పెరిగిందని.. ప్రభుత్వ పథకాలకు ప్రజలు ఆమోదం తెలిపారని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది.. నీటి ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై విమర్శలు చేశారు.. ఆఖరికి బతుకమ్మ పండుగకి కేటాయించిన నిధులపై కూడా విమర్శలు చేశారు..ఏ పథకం చేపట్టినా అసత్య ప్రచారం తగదని.. ప్రతిపక్షాలు వ్యక్తిగత నిందారోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. అంతేకాదు రూ. 33 వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్ పలు అంశాలను నేరవేరుస్తామని హామి ఇచ్చారు అవి
* తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
* అశా వర్కర్ల సమస్యల విషయంలో కేంద్రపై ఒత్తిడి తీసుకొస్తాం.
* వచ్చే రెండు నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.
* అర్హులైన బీసీలకు త్వరలో కల్యాణ లక్ష్మీ పథకం అమలు అయ్యేలా చూస్తాం.
* కాలేజ్, యూనివర్శిటీ హాస్టళ్లకు సన్న బియ్య అందిస్తాం.
* త్వరలో డీఎస్సీ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం.