అమీర్ అసహనంపై పలువురి విమర్శలు..

 

అసహంపై అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దీంతో తను అందోళనకు.. అభద్రతాభావానికి గురైనట్టు.. తన భార్య కిరణ్ రావు కూడా దేశం విడిచి వెళ్లిపోదామనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు రామ్ నాథ్ గోయంకా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ వ్యాఖ్యానించారు. దీంతో అమీర్ చేసిన ఈ వ్యాఖ్యలకు పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ

 

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాంగోపాల్ వర్మ ఇప్పుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు.  అసలు దేశంలో అసహనం ఎక్కడుందో తనకు కనిపించటం లేదని, తనకు అలాంటిదేమీ అర్థం కావటంలేదని వర్మ అన్నారు. ‘‘హిందూ దేశంలో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి ముగ్గురు ముస్లింలు.. సూపర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో నిజంగా అసహనం ఉంటే వాళ్లు ముగ్గురూ స్టార్లు అయ్యేవారా? అసలు అసహనం ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు’’ అని వర్మ ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ

 

ఆమిర్‌ ఖాన్‌ దేశం వదిలిపోవాలని తాము ఎప్పుడూ చెప్పలేదని.. ఆయన భారత్‌లో క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావితం చూపిస్తాయని అన్నారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ

 

 అమీర్ ఖాన్ భారతదేశాన్ని వీడుతానని చెప్పడం.. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమేనని పేర్కొన్నారు. భూమండలం ఉన్నంత వరకు భారతదేశం నుంచి తమను ఎవరూ వేరు చేయలేరని ఓవైసీ స్పష్టం చేశారు. తాము భారత్‌ను వీడి వెళ్లాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు.
 
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

 

గతంలో ఎన్నడూ లేనిది ఈ ఎనిమిది నెలల్లో అసహనం పెరిగిందా.. మీ భార్య దేశం విడిచి వెళ్దామని చెప్పిందనన్నావు.. ఏ దేశం వెళ్లాలనుకుంటుదో కనుక్కున్నావా అంటూ మండిపడ్డారా. అంతేకాదు గతంలో సత్యమేవ జయతి కార్యక్రమంలో చెడును తుంచే దిశగా మాట్లాడి ప్రజల్లో ఆశలు నింపావు ఇప్పుడు అసహంపై మాట్లాడి దేశంలోని ప్రజల్లో భయాన్ని నింపుతున్నావని అన్నారు. అంతేకాదు అసహనం పై మాట్లాడిని అమీర్ ఖాన్ పై అనుపమ్ ఖేర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అవి

* ‘నన్ను స్టార్ హీరోను చేసిన ఇండియాను వదిలి వెళ్లాలనుకుంటున్నావా’ అని మీ భార్యను అడిగారా?

* గతంలో ఇంతకంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఇండియా వదిలి వెళ్లాలనిపించలేదా అని కిరణ్ ను ప్రశ్నించారా?

* ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ కాస్తా 7-8 నెలల కాలంలో మీకు ‘ఇన్ టోలరెంట్ ఇండియా’గా ఎలా మారిందో చెప్పగలరా?

* దేశంలో మత అసహనం పెరిగిందని అంటున్నారు. దీని ద్వారా ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి. ఇండియా వదిలి వెళ్లమంటారా? లేదా పరిస్థితులు చక్కబడేవరకు ఆగమంటారా?

మొత్తానికి అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ నాయకుల దగ్గర నుండి సనీ ప్రముఖులు కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆ అసహనం పై.. అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.