అదంతా మీడియా సృష్టే

న్యూఢిల్లీ: గవర్నర్ పదవికి సంబంధించి తనకు ఎటువంటి సమాచారంలేదని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చెప్పారు. ఆయన న్యూఢిల్లీ  చేరుకున్న తరువాత మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవికి సంబంధించి వస్తున్నవన్నీ మీడియా కథనాలేన్నారు. పార్టీ అధిష్టానం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదని చెప్పారు. మూడు రాష్ట్రాల్లో గెలుపుపై శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితిపై సమీక్ష చేయవలసి ఉందన్నారు. ఓటమిపై ఆత్మపరిశీలన అవసరం అన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని రోశయ్య  మధ్యాహ్నం కలవనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu