గాంధీభవన్‌లో కుమ్ములాట

 

గాంధీభవన్‌లో జరుగుతున్న టీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఆహ్వాన జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు సీనియర్ నేతలు పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నిలదీశారు. కనీసం తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సభ్యుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీ పీసీసీ కార్యవర్గ జాబితాలో ఉన్న ఏపీ నేతల పేర్లు తొలగించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. డీఎస్, జానారెడ్డి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu