నల్గొండ బంద్.. టీడీపీ లీడర్ల అరెస్ట్

 

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బంద్‌లో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కొత్తగూడెం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డితోపాటు మోత్కుపల్లి నరసింహులు తదితర తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వారిని పోచంపల్లి స్టేషన్‌కి తరలించారు.