చిరంజీవి, నాగార్జున, సచిన్ లు కలసిన రహస్యం ఇదే..
posted on Jun 1, 2016 1:18PM

టాలీవుడ్ స్టార్లు చిరంజీవి, నాగార్జున క్రికెటర్ సచిన్ ఒకేసారి తిరుమల దర్శనం చేసుకున్నారు. అయితే వీరు ముగ్గురు యాదృశ్చికంగా కలిశారు అని అనుకున్నారు కానీ.. ఓ పనిమీదే కలిశారన్న విషయం చాలా లేట్ గా అర్దమైంది. తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం అనంతరం.. వీరు ముగ్గురు నేరుగా కేరళ సీఎం పినరాయి విజయన్ ను కలిశారు. కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని పక్కా ప్లాన్ వేసుకున్న ముగ్గురూ ..దీనిపై మాట్లాడటానికి సీఎం పినరాయి విజయన్ అపాయింట్ మెంట్ ముందే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందు తిరపతిలో దర్శనం కొరకు వచ్చి.. అక్కడి నుండి కేరళ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
ఇక వీరికి స్వాగతం పలికిన విజయన్ అకాడమీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్ లు కేరళా బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టుకు యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరితో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు.