పీకల్లోతు నష్టాల్లో రిలయన్స్..అంబానీకి జీతం కూడా లేదా..?

ఒకవైపు అన్నయ్య ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ లాభాలతో దూసుకెళ్తుండగా..ఆయన సోదరుడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మాత్రం పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో సంస్థను బ్రతికించడానికి నష్టనివారణా చర్యలు ప్రారంభించారు అనిల్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమీషన్ గానీ స్వీకరించకూడదని అనిల్ అంబానీ నిర్ణయించుకున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది. బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించారని..2017 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu