దారుణం.. బాలుడే బాలుడిపై లైంగిక దాడి.. ఆపై హత్య
posted on Jul 6, 2017 3:19PM
.jpg)
హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ పదహారేళ్ల బాలుడు.. పదేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిపి హత్య చేశాడు. వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని పాతబస్తీ బార్కాస్ లో మహ్మద్ ఖాన్ అనే పదేళ్ల బాలుడు గత నెల 28న మైదానంలో ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పోయి తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితంగా కనిపించిన 17సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా..పోలీసులు ఖంగు తినే విషయాలు బయటపడ్డాయి. విచారణలో అతను చెప్పినదేంటంటే.. బాలుడిని నిందితుడు ప్రభుత్వ పాఠశాల భవనంపైన ఏర్పాటు చేసిన నీళ్లట్యాంక్ వెనుకకు తీసుకుపోయి అసహజ లైంగిక దాడి చేశానని.. విషయం ఎవరికైనా చెబుతాడనే ఉద్దేశ్యంతో ఇనుపరాడ్‌తో తలపై కొట్టానని చెప్పాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు గతంలోనూ తనకంటే చిన్నవాళ్లను బెదిరించి ఇలాంటి చర్యలకు పాల్పడేవాడని.. ఇప్పటి వరకూ 15 మందిపై లైంగిక దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది.