చైనా బొగ్గు గనిలో బ్లాస్ట్.. 24 మంది మృతి

 

చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లో ఒక బొగ్గు గనిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 52 మంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ స్థానిక ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఈ కంపెనీలో దాదాపు 5000  మంది కార్మికులు పని చేస్తున్నారు. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు.