కుటుంబం ఇలా ఉంటే ఆ ఇంటి పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారట..!
posted on Oct 5, 2024 9:30AM
జీవితంలో ప్రతి వ్యక్తికి కుటుంబం చాలా కీలకం. మనిషికి కుటుంబం ఆర్థికంగానే కాదు.. వ్యక్తిత్వ పరంగా, విలువల పరంగా చాలా నేర్పుతుంది. కుటుంబం గురించి, కుటుంబం ఎలా ఉంటే పిల్లలు అభివృద్ది పథంలో దూసుకెళ్తారు అనే విషయం గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావించాడు. సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. దీని గురించి తెలుసుకుంటే..
'మూర్ఖా యత్ర న పూజ్యంతే ధాన్యం యత్ర సుసఞ్చితం' దమ్పత్యేః కల్హో నాస్తి తత్ర శ్రీః స్వయమాగతః ।
ఒక ఇంట్లో మూర్ఖులను గౌరవించడం కంటే ఆ ఇంట్లో మంచి వారిని, మంచి గుణం కలిగిన వారిని గౌరవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందట. ఇలాంటి కుటుంబంలో ఉన్న వారు జీవితంలో అబివృద్ది చెందుతారట. ఇది మాత్రమే కాదు.. ఇంకా ఏమన్నారంటే..
యస్య పుత్రో వశిభూతో భార్యా ఛన్దానుగామినీ ।
విభవే యశ్చ సతాంసతస్య స్వర్గం .
చాణక్య నీతిలో పొందుపరిచిన ఈ శ్లోకం ప్రకారం.. ఎవరి కొడుకు అయితే నియంత్రణలో ఉంటాడో.. ఏ ఇంట్లో అయితే మహిళలు కూడా తమ కోరిక,అభివృద్ది మేరకు విద్య, ఉద్యోగం విషయాలలో ఉండగలుగుతుందో, ఏ ఇంట్లో అయితే తాము సంపాదించుకున్న డబ్బుతో తృప్చిగా ఉంటారో.. అలాంటి కుటుంబంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారట. అలాంటి ఇళ్లలోనే ఆనందం కూడా ఉంటుందట.
తే పుత్రా యే పితుర్భక్తాః సా పితా యస్తు నూత్రికాః ।
తన్మిత్రం యస్య విశ్వాసః స భార్యా యత్ర నిర్వృత్తిః ।
చాణక్య నీతి ప్రకారం ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటారో.. ఏ ఇంట్లో అయితే పిల్లలు తల్లిదండ్రుల మాట పాటిస్తారో ఆ ఇంటి పెద్ద ఎప్పడూ సంతోషంగా ఉంటాడట. తండ్రి మాటను పాటించే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో, సంతోషంతో ఉంటుందట.
నీతిజ్ఞః శీలమ్పన్నా భవన్తి, కులపూజితః.
బాల్యంలో చదివిన విద్యను బట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారని చాణక్య నీతిలోని ఈ శ్లోకం అర్థం. అందుకే పిల్లలకు చిన్నతనంలోనే మంచిదారిలో తీసుకువెళ్లాలి. వారికి మంచి చెడుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనంలోనే చెప్పాలి. అలాంటి పిల్లలు పెద్దయ్యే కొద్ది ఉత్తమ పౌరులుగా అబివృద్ది పథంలో దూసుకుపోతారు.
*రూపశ్రీ.