జింక మాంసం విక్రయిస్తున్న చికెన్ షాన్ ఓనర్ అరెస్టు
posted on Jan 1, 2026 10:29PM

హైదరాబాద్లో అక్రమంగా జింక మాంసం విక్రయిస్తున్నఓ చికెన్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు అతడి షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్బు హసన్ అలి జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్‌కు అందించేవాడనీ, ఆ మాంసాన్ని తన చికెన్ షాప్ ద్వారా మహ్మద్ ఇర్ఫాన్ విక్రయించేవాడనీ తేలింది.
అయితే మహమ్మద్ అబ్బు హసన్ అలి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇర్ఫాన్ వద్ద నుంచి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.