జగన్ ప్రభుత్వానికి అప్పుడే కౌంట్ డౌన్ మొదలైంది!

 

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లల్లో రైతులకు ఒక్కసారి కూడా ఎరువులు, విత్తనాల సమస్య రాలేదని బాబు గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం వల్లే ఇప్పుడు రైతులు రోడ్డు ఎక్కారని వైసీపీ నేతలంటే ప్రజలు నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. 

అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ కోతల అంశాన్ని కూడా బాబు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే విద్యుత్‌ కోతలు లేకుండా చేశామని.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే విద్యుత్‌ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కోతల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని బాబు చెప్పారు. 

వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల కంటే ఎక్కువగా రాజకీయ అంశాలపైనే దృష్టి పెడుతోందని బాబు విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వానికి అప్పుడే కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పార్టీ అండగా ఉంటుందని, త్వరలోనే వారి కుటుంబాలను పరామర్శిస్తామని బాబు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu