చంద్రబాబు అరెస్ట్...ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ?

 

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్దం అయినట్టేనని ప్రకటించి కలకలం రేపారు ఏపీ ఇంచార్జ్ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్. దీంతో ఏ క్షణంలోనైనా బాబును అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల పలువురు బీజేపీ, వైసీపీ నేతలు బాబు అరెస్టు ఖాయమని వ్యాఖ్యలు  చేశారు. కానీ వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ బీజేపీ ముఖ్యనేత ఇలా వ్యాఖ్యానించడంతో ఈ అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. 

టీడీపీకి చెందిన 18మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఓటుకు నోటు, ఇతర అవినీతి కేసుల్లో త్వరలో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని తెలిసే వారు వైసీపీలోకి వెళ్ళలేక తమకి టచ్ లోకి వచ్చారని పేర్కొని కలకలం రేపారు. బాబు సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా అవినీతిలో భాగస్వాములయ్యారని అందుకే 18మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. 

టీడీపీ త్వరలో ఖాళీ అవడం ఖాయమని చెబుతున్నారు, ఇక ఆయన మాటలకి ఊతం ఇచ్చేలా పలు జాతీయ మీడియా సంస్థలు కూడా బాబు అరెస్టుకు సంబంధించిన కథనాలను ప్రచురించాయి. దీంతో చంద్రబాబు అరెస్టు అవుతారన్న చర్చ హాట్ టాపిక్ గా సాగుతోంది. తమిళనాడులో కరుణానిధి సీఎం పదవి కోల్పోయిన తర్వాత జయలలిత అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పలు అభియోగాలతో కరుణానిధిని జయలలిత అరెస్టు చేయించారు. 

ఈ పోలికలతో ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. ఇప్పటికే ఏపీ రాజ్యసభలోని నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరి ఆ పార్టీనే విలీనం చేసిన విషయం తెలిసింది. అదే ఊపులో ఏపీ అసెంబ్లీలోనూ టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పార్టీనే విలీనం చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష పార్టీ హోదా దక్కించుకోనుందనన్నమాట. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu