మంత్రిగారిపై చంద్రబాబు సీరియస్.. ఇక్కడుండి ఏం చేస్తున్నారు..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తే అస్సలు ఊరుకోరన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈయన అంతగా పట్టించుకోకపోయిన ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం అస్సలు ఊరుకోవడంలేదు. పని చేయని వారికి స్పాట్ లో క్లాస్ లు తీసుకుంటున్నారు. అది ప్రభుత్వ అధికారులు కాని, మంత్రులు కాని, పార్టీ నేతలు కాని ఎవరైనా వారిని ఉపేక్షించడంలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ మంత్రిగారు పై చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్రంలో కల్తీ మందు, కల్తీ నెయ్యి, ఇప్పుడు తాజాగా కాల్ మనీ వ్యవహారం బయటకు రావడంతో..  వీటిని ముందుగా పసిగట్టి చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని.. హోం మంత్రిగా ఉన్న చినరాజప్ప  ఈవిషయాలను ముందుగా గుర్తించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ది చేయడానికి నేను దేశాలు తిరుగుతుంటే మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు.. మీరెప్పుడు ఇలాంటి అంశాలపై దృష్టి పెడతారని ప్రశ్నించారట. ఇకపై ఏ చిన్న పొరపాటు జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని… అంతవరకు రాకముందే మీ శాఖ వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని రాష్ట్ర హోంమంత్రిని ఆదేశించారంట. దీంతో క్యాబినెట్ మార్పు చేయాలని చంద్రబాబు చూస్తున్న నేపథ్యంలో చినరాజప్ప మంత్రిగారి పదవి కూడా డౌట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది.