ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోండి.. నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ!

హస్తిన పర్యటనలో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడేలా సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలలో కోరుతు న్నారు. అందులో భాగంగానే కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లో జరిగిన భేటీలో చంద్రబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. జగన్ ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు.

రాష్ట్ర ప్రగతిని  కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలన్నారు.   కేంద్ర బడ్జెట్‌లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని ఏపీ ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎన్డీయే ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్,ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్,కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.

అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు కలిశారు.   నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో , అలాగే కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు భేటీ  అయ్యారు.