ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. ప్రధాని, ప్రియాంక పిలుపు
posted on Nov 30, 2023 10:16AM
తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా x వేదికగా రాష్ట్ర ప్రజలకు సందేశం పంపారు.
తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
యువత, ముఖ్యంగా తొలి సారి ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ ప్రత్యేకంగా కోరారు.
అలాగే ప్రియాంక గాంధీ కూడా ఓటు హక్కును వినియోగించుకుని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ అయితే బంగారు తెలంగాణ కలలను సాకారం చేసుకునేందుకు తప్పని సరిగా ఓటేయాలని కోరారు.