ఆగ‌ష్టు 15న పుట్టి  12 దాట‌నివారికి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం 

ఇంట్లో అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా వెంట‌నే పంచాంగాలు తిర‌గేసి మంచిరోజు, న‌క్ష‌త్రం వేట‌లో చాలామంది ఆ రోజు మంచిదా కాదా అన్న‌ది ప్ర‌క‌టిస్తారు. అది వారి న‌మ్మ‌కం. ఈ రోజుల్లో న‌మ్మ‌కాల‌కూ పెద్ద పీట వేస్తుండ‌డ‌మే చిత్రం. కాలం మారింది, కంప్యూట‌ర్లు, మొబైల్ త‌ప్ప లోకంతో ప్ర‌త్య‌క్షంగా పెద్ద‌గా ప‌నిలేకుండా పోయింది. ఈ రోజుల్లోనూ కొంద‌రు శ‌నివారం పుట్టింది.. మంచిషే నంటావా? అని ఓ పెద్దా య‌న త‌న ప‌క్కింటి మ‌రో అడ్డ‌బొట్టు జ్యోతిష్కుడిని వేధించి చంపుతాడు. అయ్యా అంతా బాగు బాగు.. అని త‌ప్పించుకుంటాడు. ఈ చిత్రం ఇప్ప‌టికీ గ్రామాల్లో నిత్య‌కృత్యం. కాగా ఇపుడు తెలంగాణా ప్ర‌భుత్వం కూడా పాటించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుంది. కేంద్రం అజాదీ కా అమృ తోత్స‌వం సంద‌ర్భంగా కేంద్రం ప్ర‌క‌టించిన కేంద్రానికి ధీటుగా తెలంగాణా ప్ర‌భుత్వం కూడా స‌రికొత్త వ్యూహం అనుస‌రించి తెలంగాణా ఆక‌ర్ష్ కి మ‌రింత ద‌న్ను ఇచ్చారు. 

ఆగ‌ష్టు 15న జ‌న్మించిన పిల్ల‌ల‌కు వారికి 12 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కూ బ‌స్సు ప్ర‌యాణం ఉచిత‌మ‌ని ప్ర‌క‌టిం చారు. అందులో ఉచితం ఏమిటో ఎవ‌రికీ అర్ధం కావ‌డంలేదు. ఎలాగూ ఐదేళ్ల దాకా అమ్మ‌తోనో, అమ్మ‌ మ్మ‌తోనో ప్ర‌యాణిస్తారు. కిటికీద‌గ్గ‌ర కూచుంటే ఆనంద కేరింత‌ల్లో ప్ర‌యాణీకుల‌ను ఎంతో ఆక‌ట్టుకుం టారు. అదో స‌ర‌దా! 

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా , 75 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ నెల 21 వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు పలు రాయితీలను ప్రకటించింది.  సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ బుధవారం ప్రకటించారు. 75 ఏళ్లు పై బడినవారికి ఆర్టీసీ తార్నాక దవాఖానలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి 75ు రాయితీపై మందులు అందించను న్నట్లు తెలిపారు. 

ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌(టీఏవైఎల్‌) టికెట్‌ చార్జీలను రూ.120 నుంచి రూ.75కు తగ్గించినట్లు పేర్కొన్నా రు. కేజీ లోపు కార్గో పార్సిళ్లపై ఆగస్టు 15న 75 కిలోమీటర్ల వరకు ఎలాంటి చార్జీ ఉండదని గోవర్ధన్‌ తెలి పా రు. ప్రతి రోజూ దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 75 మందిని గుర్తించి తర్వాత ట్రిప్‌కి ఫ్రీ టిక్కెట్‌ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. పుష్పక్‌ ఎయిర్‌పోర్టు సర్వీస్‌ బస్సుల్లో 75ు చార్జీతోనే ప్రయాణి కులను గమ్యస్థానాలకు చేర్చనున్నట్లు తెలిపారు.