చెట్టును ఢీకొట్టిన బస్సు.. 43 మంది మృతి..


బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో దాదాపు  43 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జింబాబ్వేలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జింబాబ్వే నుంచి జాంబియాకు వెళ్తున్న బస్పు సడెన్ గా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 43 మంది మృతి చెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జాంబియాలోని న్యామకేట్ సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారి చారిటీ చరంబ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu