టీ-20 ప్రపంచకప్ భారత్ జట్టు...బుమ్రా,హర్షల్, అక్షర్‌లకు చోటు
posted on Sep 12, 2022 10:21PM
ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది జరగ నున్న టీ20 వరల్డ్ కప్2022కి భారత జట్టుని సెలెక్టర్లు సోమవారం ప్రక టించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికవగా.. ఫాస్ట్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చా రు. గాయం కారణంగా ఈ ఇద్దరూ ఆసియా కప్ 2022కి దూరంగా ఉండిపోయిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం అక్టో బరు 16 నుంచి నవంబరు 13 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుంది.
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్16న క్వాలిఫైర్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఆక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. నవంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్న మెంట్ లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. గత ఏడాది ప్రపంచ కప్‌లో పాక్ చేతిలో ఘోర ఓటమికు టీమిండియా బదులు తీర్చుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ఇప్పటినుంచే ప్రపంచ కప్ సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2022లో పాల్గొనే భారత జట్టును టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్. స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్