భివండిలో మళ్లీ కూలిన భవనం..

దేశ ఆర్థిక రాజధాని ముంబై శివార్లలో ఉన్న భివండిలో భవనాలు కూకటి వేళ్లతో సహా కూలిపోతున్నాయి. గత ఆదివారం రెండు అంతస్థుల భవనం కూలి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరచిపోకముందే మళ్లీ ఈ ఆదివారం మరో భవనం కూలిపోయింది. ఉదయం స్ధానిక కళ్యాణ్ రోడ్డులోని రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న మున్సిపల్, రెవెన్యూ, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల నుంచి ఇప్పటి వరకు రెండు మృతదేహలను వెలికి తీశారు. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu