అత్యాచారం చేసినందుకు 51 గుంజీలు..
posted on Aug 7, 2016 12:57PM
.jpg)
సాధారణంగా అత్యాచారం చేసినప్పుడు నిందితుడికి జైలు శిక్ష విధిస్తారు. కానీ బీహార్లో మాత్రం చాలా విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చారు పెద్దలు. వివరాల ప్రకారం.. బీహార్ లోని ఓ గ్రామంలో అశోక్ అనే యువకుడు ఓ దళిత బాలికపై అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేందుకు కారణమయ్యాడు. అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించడంతో.. మొదట భయపడిన బాలిక ఆతరువాత తన తల్లిదండ్రులకు చెప్పింది.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని నిలదీస్తే, అబార్షన్ చేయించుకుని వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, ఆ మాటలు నమ్మి తమ బిడ్డ గర్భాన్ని తొలగించి తీసుకువచ్చారు. కానీ ఆతరువాత కూడా అశోక్ పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు పంచాయితీని ఆశ్రయించగా.. దీనిపై విచారించిన పంచాయితీ పెద్దలు 51 గుంజీలు తీయాలని శిక్ష వేసి, రూ. 1000 జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో, నిందితుడు, పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరి అత్యాచారం చేసినందుకు ఇంతటి చిన్న శిక్ష విధించడం చాలా దారుణం..