రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆమె అక్కడికక్కడే కన్ను మూశారు.

కారులో ఉన్న ఆమె పీఏ ఆకాశ్, డ్రైవర్  తీవ్రంగా గాయపడ్డారు.  ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ పై అదుపుతప్పి రైలింగ్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

సాయినందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత ఏడాది ఫిబ్రవరిలో సాయన్న మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో లాస్య నందిత బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.