బ్రాహ్మణికి ఆ ప్లాట్ బాలకృష్ణే కొన్నాడు బాబు

హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో తన కోడలు నారా బ్రాహ్మణికి తన కుమారుడు నారా లోకేష్‌తో వివాహం జరగక ముందే బాలకృష్ణ ఆ ప్లాట్ కొన్నాడని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో విల్లాలు, ప్లాట్లు కొన్నవారందరికీ సిబిఐ నోటీసులు జారీ చేసిన క్రమంలో నారా బ్రాహ్మణికి కూడా నోటీసు జారీ అయింది. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో బ్రాహ్మణికి బాలకృష్ణనే ప్లాట్ కొన్నాడని,  ఎమ్మార్ ప్రాపర్టీస్ జీవో కాపీలను ఆయన విడుదల చేస్తూ మరో సారి ఆ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో తమ ప్రభుత్వ హయాంలోనే అవగాహనా ఒప్పందం (ఎంఒయు) కుదిరిందని, భూకేటాయింపులు మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగాయని ఆయన అన్నారు. తాము ఓ మంచి ఉద్దేశంతో ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెసు ప్రభుత్వం కుంభకోణాల పుట్టగా మార్చిందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. చేతిలో పత్రిక ఉంది కదా అని అవాస్తవాలు రాయడం మంచిది కాదని ఆయన వైయస్ జగన్‌కు సూచించారు. వైయస్ జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి కాంగ్రెసుకు సరెండరయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమాలపై పోరాటం చేస్తే నవ్వుకున్నారని, ఇప్పుడు పాపం పండిందని ఆయన అన్నారు. రాజకీయ నేతలు ఆస్తులు ప్రకటిస్తేనే విశ్వసనీయత పెరుగుతుందని ఆయన అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu