బాయ్ ఫ్రెండ్ ముద్దు.. ప్రాణాలనే తీసింది..

 

బాయ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దు ఏకంగా ఆమె ప్రాణాలనే తీసింది. ఈ విచిత్రమైన ఘటన ఇంగ్లడ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మరియమ్ లిమే అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కలిసింది. ఎంచక్కా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆఖరిలో ఆమె తిరిగి వచ్చేటప్పుడు అతను ఆమెకు ఓ ముద్దు కూడా పెట్టాడు. అంతే కాసేపటికి ఊపిరి ఆడనట్టు అయిపోయి.. ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడి చివరికి ప్రాణాలు కోల్పోయింది మరియమ్ లిమే. ఆమెకు పోస్టు మార్టం చేసిన వైద్యులు కూడా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని తేల్చిచెప్పారు. అయితే ఆమె చనిపోవడానికి.. అతని ముద్దకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమెకు ఆస్తమా ఉంది. మరియమ్ ను ముద్దుపెట్టుకునే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్ (వేరు శనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. ఆస్తమాతో బాధపడేవారికి పీనట్ అలర్జీ ఉంటుంది.. అది కొద్దిగా తిన్నా ప్రాణాలకే ప్రమాదం. ఈ కారణంతోనే ఆమె చనిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu