బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ... లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలి..
posted on Jun 14, 2016 4:54PM

విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై, ప్రభుత్వం విమర్శల బాణాలు సంధించారు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ.. జాబు మాత్రం రావడం లేదు.. నిరుద్యోగ భృతి గురించి మాట కూడా మాట్లాడటం లేదు అని అన్నారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లో కొంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలను కొంటే ఎన్నికల్లో గెలవలేరు.. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలి.. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలి అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు లీడర్లు అవ్వాలంటే ఏం చేయాలో కూడా జగన్ సలహాలు ఇచ్చారు. రోజుకి నాలుగు గంటల చొప్పున, 5 నెలల పాటు రోజుకొక పంచాయతీ చొప్పున ప్రచారం చేస్తే... విజయం మీ సొంతమవుతుందని.. 5 నెలలు పూర్తయ్యే సరికి మీరు లీడర్లు అవుతారని ఆయన చెప్పారు.