గ్రేట్ బాస్.. ఒక్కో ఉద్యోగికి కోటిన్నర బోనస్
posted on Aug 4, 2015 3:09PM
ఒక కంపెనీ ఉన్నత స్థాయికి చేరాలంటే ఆ కంపెనీ యాజమానే కాదు అందులో పనిచేసే ఉద్యోగులది ఎంతో కీలక పాత్ర ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్ లంటూ అప్పుడప్పుడు పార్టీలంటూ ఏర్పాటు చేసి వారిని ఉత్తేజపరుస్తారు. అయితే ఇక్కడ ఓ వ్యాపార వేత్త ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల డాలర్లు అంటే కోటిన్నర రూపాయలు బోనస్ గా ఇచ్చి ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వివరాలు చూద్దాం..
టర్కీకి చెందిన నెవ్‌జాత్ అదియాన్ వ్యక్తికి యెమక్‌సేపతి.కామ్ అనే ఆన్‌లైన్ కంపెనీ ఉంది. అయితే అతను తన కంపెనీని జర్మనీకి చెందిన ‘డెలివరీ హీరో అనే వ్యాపారవేత్తకు ఈ ఏడాది మేలో 589 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. అయితే నెవ్‌జాత్ తన కంపెనీని అమ్మగా వచ్చిన డబ్బులో కొంత డబ్బున ఉద్యోగులకు అందించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతే తన కంపెనీ ఇంత పైకి రావడానికి తన ఉద్యోగులే కారణమని అందులోనే 27 మిలియన్ డాలర్లు అంటే 173 కోట్లను ఉద్యోగులకు కేటాయించాడు. దీంతో ఆ కంపెనీలు పని చేసిన ఒక్కో ఉద్యోగీ దాదాపు కోటిన్నర దక్కించుకున్నారు. ఇంకేముంది తన యాజమాని చేసిన ఈ పనికి ఉద్యోగులు ఉబ్బితబ్బిబయ్యారంట. కొంతమందైతే ఆనందంతో ఏడ్చేశారంట కూడా. ఇలాంటి బాస్ అందరికి ఉంటే ఎంత బావుండో..