అమెరికాకు బాంబ్ సైక్లోన్ ముప్పు!

తీవ్ర తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. అమెరికా తీరప్రాంతానికి బాంబ్ సైక్లోన్ ముప్పు పొంచి ఉంది. అమెరికాపై పంజావిసరడానికి సిద్ధంగా ఉన్న తీవ్ర వాయు‘గండం’. దీనికే బాంబ్ సైక్లోన్ అని పేరు పెట్టారు. దీని ప్రభావం పలు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.  ఈదురుగాలులు, కుండపోత వర్షంతో బాంబ్ సైక్లోన్ అమెరికా తీర ప్రాంతాలపై విరుచుకుపడనుంది.

దీని ప్రభావం ప్రధానంగా కాలిఫోర్నియాపై అతి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. ఎనిమిది గ్యాలన్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.  బాంబ్ సైక్లోన్ ప్రభావంతో ఉత్తర కాలిఫోర్నియా, దక్షిణ ఒరెగన్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే భారీగా వరదముంపు ప్రమాదం కూడా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.