తెలంగాణ  బిజెపీ  సారథిగా ఎన్ రామ్ చందర్ రావు ?

తెలంగాణ బిజెపి  అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పదవికి ఈటెల రాజేందర్ పేరు వినిపించినప్పటికీ ఆయన మల్కాజ్ గిరి లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కేంద్రమంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. అయితే ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించలేదు. బండి సంజయ్ కు ఈ పదవి వరించడంతో ఈటెల తీవ్ర నిరాశ చెందారు. ఇదే సమయంలో బిజెపి నూతన సారథి ఈటెల అని ప్రచారం జరిగింది. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాంచందర్ రావు బిజెపీలో సీనియర్ నేత. పార్టీలో ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచి సంచలనం రేపారు. అంతేకాదు మల్కాజ్ గిరి ఎంపీగా  రెండు సార్లు బీజేపీ తరుపున ఎన్నికల బరిలో నిలిచారు. ఈటెలకు బదులు డికె అరుణ, రఘునందన్ రావు పేర్లు కూడా వినిపించాయి.  సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రాంచందర్ రావు  నల్గొండ జిల్లా వాస్తవ్యుడు. చట్టాలపై మంచి అవగాహన ఉన్న రాంచందర్ రావు పార్టీకి విధేయుడిగా పేరు ఉంది. ఆయన గత లోకసభ ఎన్నికలలో మల్కాజ్ గిరిస్థానం నుంచి పోటీచేయాలనుకున్నారు. ఈటెల పేరు ఖరారు కావడంతో డ్రాప్ అయ్యారు