ఏబీవీకి బిగ్ రిలీఫ్.. సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీం

ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు సస్పెన్షన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నంచీ ఎబీవీని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురౌతూనే ఉన్నారు

ఏబీవీ.  ఆయనపై స‌స్పెన్ష‌న్‌ వేటు వేసింది. ఆ సస్పెన్షన్ అలా  కొనసాగుతూనే ఉంది.  దీనిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.  నిబంధ‌న‌ల ప్ర‌కారం రెండేళ్ల‌కు మించి త‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డానికి వీళ్లేద‌ని.. త‌న‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవ‌డంతో పాటు.. పూర్తి జీతం చెల్లించాలంటూ  సుప్రీంకోర్టును   ఆశ్ర‌యించారు ఏబీవీ.  

దానిపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆయన సస్పెన్షన్ రద్దు చేస్తూ దేశ సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది  వెంటనే ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశించింది.