ఒబామా పై న్యూస్‌ ఛానల్ వ్యాఖ్యత కామెంట్లు.. ఉల్లిపాయతో ఏడ్చారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల జరిగిన బహిరంగ సభలో శాండీ స్కూల్ లో 2012లో తుపాకీ కాల్పులకు బలైన 20 మంది చిన్నారులను గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పెట్టిన కన్నీళ్లను ఉద్దేశించి ఫాక్స్ న్యూస్‌ ఛానల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ విమర్సించారు. బరాక్ ఒబామా కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించారని.. ఒబామా ఏడవడం నమ్మశక్యంగా లేదని..  'ఒబామా మాట్లాడిన తర్వాత వేదిక వద్ద ఉల్లిపాయ లేదా నో మోర్ టియర్స్(జాన్సన్ బేబీ షాంపూ బ్రాండ్ నేమ్) కోసం వెతికాను అని ఎద్దేవ చేశారు. అసలే ఇది అవార్డుల సీజన్' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే ఆండ్రియా చేసిన వ్యాఖ్యలకు గాను ఫాక్స్ న్యూస్‌ ఛానల్ ఒబామాపై విమర్శలు చేయడం కొత్తేమి కాదని లైట్ తీసుకుంటున్నారట.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu