కుండపోత వర్షాలు.. 105 మంది మృతి..

 

కుండపోత వర్షాలు కారణంగా బంగ్లాదేశ్‌ అతలాకుతలమైపోయింది. బంగ్లాదేశ్‌లోని ఈశాన్య ప్రాంతంలోని కుండపోతగా వర్షాలు కురవడంతో కొండ చరియలు విరిగి పడి 105 మంది మరణించారు. మృతుల్లో ఒక ఆర్మీ మేజర్, కెప్టెన్ సహా మరో ఇద్దరు సైనికులు ఉన్నారు. వంద మందికి పైగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. మట్టిదిబ్బల కింద చిక్కుకుని మరికొంత మంది మరణించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. పలువురి ఆచూకీ తెలియడం లేదు. ప్రజలంతా నిద్రపోతున్న సమయంలో కొండ చరియలు విరిగి పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నదని, మృతుల్లో బాలలు ఎక్కువగా ఉన్నారని అధికారులు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu