భూవివాదంలో మరో టీఆర్ఎస్ నేత...

 

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సభ్యులు ఒకరి తరువాత ఒకరు భూ వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కె భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా  సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై భూ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  నిరుపేదల కోసం ఇచ్చిన అసైన్డ్ భూమిని అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలో గౌడవెల్లి-రాయిలాపూర్ రోడ్డులో 8.9 ఎకరాల భూమిని నిరుపేద ముదిరాజ్ లకు కేటాయించారు. అయితే ఆ భూమిని ముదిరాజ్ ల నుంచి బొక్క యాదిరెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత యాదిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, బల్వంత్ రెడ్డి, రఘుపతి రెడ్డిల నుంచి ఈ భూమిని 2015లో డీఎస్, ఆయన అనుచరుడు ఎ.వి.సత్యనారాయణలు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇది రాజకీయావర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరి ముందు ముందు ఇంకా ఎంతమంది పేర్లు బయటపడతాయో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu