మూసీ పరిసరాల్లో నిర్మాణాలపై నిషేధం

మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ ఆ పరిసరాలలో నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు

మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.  మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ మూసి పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వరాదని రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిధిలో నిర్మాణాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.  

ఇలా ఉండగా మూసీకి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతులను తప్పని సరి చేసింది. ఈ పరిధిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టాలన్నా ముందస్తు అనుమతులు తప్పని సరని ఆ ఉత్తర్వులలో పేర్కొంది.  పర్యావరణ పరిరక్షణ, క్రమబద్ధమైన అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ సర్కర్ ఈ నిర్ణయం తీసుకుంది.