గెలుపు దారి కానరాదేమి బాలినేని!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు బాలినేని అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.  

ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2019 వరకూ ఒంగోలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తోంది. 2019 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన బాలినేని జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం అన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. అభివృద్ధి మాట అలా ఉంచితే ఆయన హయాంలో నియోజకవర్గంలో అరాచకం తాండవించింది. స్వయంగా బాలినేని కుమారుడిపైనే భూ కబ్జాలు, దాడుల ఆరోపణలు ఉన్నాయి. బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో సిట్ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందంటే బాలినేని హయాంలో నియోజకవర్గంలో ఏ స్థాయిలో అరాచకత్వం రాజ్యమేలిందో ఊహించవచ్చు. 

అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్ంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  తాగునీటి పథకాలు, పోతురాజు కాలువ ప్రాజెక్టు విషయంలో బాలినేని వైఫల్యాలు నియోజకవర్గ ప్రజలలో బాలినేని ప్రతిష్టను మసకబార్చాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కు ప్రజా మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో దామచర్ల దూసుకుపోతుంటే.. బాలినేని సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. అలాగే ఒంగోలు  సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో దిగడం కూడా బాలినేని విజయావకాశాలపై ప్రభావం చూపనుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు, కొంండెపి నియోజకవర్గాలలో మంచి గుర్తింపు ఉంది. బైపాస్ రోడ్డు వంటి నిర్మాణాలతో ప్రజలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబంపై నియోజకవర్గ ప్రజలల సానుభూతి వ్య్తఅవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, టీచర్లు, కాపు సామాజికవర్గం ఈ సారి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, దామచర్ల విజయానికి మద్దతు ప్రకటించారు