ఈ టీచర్ మహా హాట్ గురూ...
posted on Jan 10, 2015 6:45PM

అనగనగా అమెరికాలోని ఓ హైస్కూలు. అందులో బ్రియానీ అల్టీస్ అనే 35 ఏళ్ళ మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన ఆమె గత కొన్ని సంవత్సరాలుగా టీనేజ్‌లో వున్న తన విద్యార్థులకు కామపాఠాలు నేర్పిస్తోంది. తనకు నచ్చిన టీనేజ్ కుర్రాళ్ళ మీద వలపు వల విసిరి వారిని తనచుట్టూ తిప్పుకుంటూ దర్జాగా సుఖిస్తోంది. ఈ విషయం కొద్ది నెలల క్రితం బయటపడింది. దాంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెని కోర్టులో హాజరు పరిస్తే పదివేల డాలర్ల పూచీకత్తు కట్టి దర్జాగా బయటకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో వుంది. అయితే స్కూల్లో అంత ఘనకార్యం చేసినందుకు ఈమెగారి ఉద్యోగం ఊడిపోయింది. స్కూల్లోని దాదాపు పదీ పన్నెండు మంది కుర్రాళ్ళు ఈమె బారిన పడ్డారు. తామూ ఈ లిస్టులో వున్నామని బయటపడకుండా వున్న కుర్రాళ్ళు ఎంతమంది వున్నారో తెలియడం లేదు. ఈ హాట్ టీచరమ్మ తమను ఎలా ఉపయోగించుకుందో ఆ స్కూలు స్టూడెంట్లు చెబుతుంటే పెద్దపెద్దవాళ్ళ గుండెలు కూడా గుభేల్‌మంటున్నాయి. కోర్టు విచారణ తర్వాత బ్యాడ్ టీచర్‌కి బాగానే శిక్ష పడే అవకాశం వుందని అనుకుంటున్నారు.