'బాద్ షా' డిసైడ్ అయ్యాడు
posted on Mar 25, 2013 11:52AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అయితే ఇది వరకే రిలీజ్ డేట్ ని ప్రకటించిన ఈ మధ్య తెలుగు సినిమాల విడుదలలో ఏర్పడిన గందరలగోళం కారణంగా అభిమానులకు ఖచ్చితమైన సమాచారం వుండాలని మళ్ళీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
.jpg)
ఈ చిత్రం మార్చి 29న సెన్సార్ జరగనుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ద్వారా విడుదలైన డైలాగులు ఫ్యాన్స్ ను బాగా అలరిస్తున్నాయి. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడతున్నకొద్దీ నందమూరి అభిమానులలో ఆనందం రెట్టింపవుతోంది. తాజాగా ఈ చిత్రంపై మీడియాలో, ఫ్యాన్స్ లో హైప్ ఏర్పడడంతో ఈసారి 'బాద్ షా' సూపర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని అంటున్నారు. 'బాద్ షా'డిసైడ్ అయ్యాడు ..మరి కలెక్షన్లు వన్ సైడ్ అవుతాయో లేదో చూడాలి.