అయోధ్య ఆలయంలో నమాజ్.. కశ్మీర్ యువకుడి అరెస్ట్
posted on Jan 10, 2026 5:18PM

అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ ఆవరణలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన కశ్మీర్ యువకుడిని భద్రతా సిబ్బంది శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంప్లెక్స్‌లోని దక్షిణ గోడల ప్రాంతం వద్ద ఉన్న సీతాదేవి వంటగది సమీపంలో ఆ యువకుడు నమాజ్‌కు ప్రయత్నించినట్టు సమాచారం.
కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సపోర్ట్ కోరుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయం ట్రస్టు సైతం వెంటనే స్పందించలేదు.
మరోవైపు, రామాలయానికి 15 కిలోమీటర్ల లోపు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని సరఫరా చేయరాదంటూ జిల్లా యంత్రాంగం ఒక అధికారిక ప్రకటన చేసింది. అతిథులకు నాన్‌వెజిటేరియన్ ఆహారం, ఆల్కహాలిక్ డ్రింకులు సరఫరా చేయరాదని హోటళ్లు, వసతి గృహాలకు హెచ్చరికలు చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చిన టూరిస్టులకు నాన్‌వెజ్ సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో రామాలయం, సమీప ప్రాంతాల్లో ఆన్‌లైన్ డెలివరీపై నిషేధం విధించామని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.