బెంబేలెత్తిస్తున్న ఆటో ఎల్పీజీ ధరలు

ఆటో ఎల్పీజీ ధరలు వాహన యజమానులు, ఆటో వాలాలను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండేళ్ళుగా పెట్రోల్ రెట్లు పెంచినప్పుడల్లా ఆటో ఎల్పీజీ ఇంధన రేట్లను కూడా పెంచుతూ వచ్చారు. ఇప్పుడు పెట్రోల్ రేట్లతో నిమిత్తం లేకుండా ఎల్పీజీ రేటును ఒక్కసారిగా కిలోకు సుమారుగా ఎదురూపాయలు పెంచారు. దీంతో వెలది మంది వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటో ఎల్పీజీ పర్యావరణానికి అనుకూలమైన ఇంధనంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. దీనికితోడు డీజిల్ కన్నా ఆటో ఎల్పీజీ ధర తక్కువగా ఉండటంతో ప్రముఖ కార్ల కంపెనీలు, ఆటోల తయారీల కంపెనీలు ఎల్పీజీతో పనిచేసే వాహనాలను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఎల్పీజీ ధరలు తక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో వేలాదిమంది ఎల్పీజీతో నడిచే వాహనాలను కొనుగోలు చేశారు. కానీ వారికిప్పుడు ఆటో ఎల్పీజీ వాహనాలు గుదిబండగా మారాయి. రెండేళ్ళ క్రితం కేజీ ఆటో ఎల్పీజీ ధర విశాఖలో రూ. 22 ఉండగా అది ఇప్పుడు సుమారు రూ. 56కి చేరింది. ఆటో ఎల్పీజీతో పాటు పెట్రోల్ రెట్లుకూడా పెరిగినప్పటికీ పెట్రోల్ తో పోలిస్తే ఎల్పీజీ ధర తక్కువగా ఉండేది. దీనికితోడు డీజిల్ రేటు కూడా రెండేళ్ళక్రితం ఎల్పీజీ కన్నా ఎక్కువగా వుండేది. కానీ ఇప్పుడు డీజిల్ రేటు కన్నా ఎల్పీజీ రేటు దాడాప్ ఏడెనిమిది రూపాయలు ఎక్కువయింది. నిజానికి పర్యావరాన్ పరిరక్షణ కోసం, కాలుష్యనివారణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్పీజీ, సి ఎస్ జి లకు రాయితీలు ఇవ్వాల్సి ఉంది. కాని అలా చేయకుండా ధరలమోట మొగిస్తుండటంతో వాహన యజమానులు మళ్ళీ డీజిల్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో వాహన కాలుష్యం మరింత పెరుగుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu