టీ స్టాల్ లో హరీష్..!!

ఏషియన్ గేమ్స్ - 2018 లో కాంస్యం సాధించిన భారత్ సేపక్ తక్రా (కిక్ వాలీబాల్) జట్టులో సభ్యుడైన హరీష్ కుమార్.. ప్రస్తుతం టీ అమ్ముతున్నాడు.. మెడల్ సాధించి టీ అమ్మడం ఏంటని మీడియా ప్రశ్నించగా.. తమది చాలా పేద కుటుంబమని, అందరూ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని తన దయనీయ దుస్థితిని వివరించాడు.

 

 

మాకు ఉన్న చిన్న టీ కొట్టులో మా కుటుంబానికి సాయంగా టీ అమ్ముతాను.. ప్రతిరోజూ 2 నుంచి 6 మధ్య నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తాను.. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి నా కుటుంబానికి అండగా ఉండాలనుకుంటున్నాని అన్నాడు.. ప్రత్యేకంగా ఉండే సెపక్ తక్రా ఆట ఆడటం అంత సులువు కాదు.. ఆ ఆటను ఆడటానికి తను ఎన్నో కష్టాలు పడ్డానని తెలిపాడు.. 2011 లో ఈ ఆటను ఆడడం ప్రారంభించాను.. నా కోచ్ హెమ్ రాజ్ నన్ను ఈ ఆటకు పరిచయం చేసారు.. ఒకరోజు నేను నా ఫ్రెండ్స్ తో కలిసి టైర్ ఆట ఆడుతుండగా మా కోచ్ చూసి నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు తీసుకెళ్లారు.. అప్పటి నుంచి ఉపకార వేతనాలు అందుకుంటూ ఆటను నేర్చుకున్నాను.. దేశానికీ మెడల్ సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ చేసేవాడిని అని హరీష్ కుమార్ తెలిపాడు.