వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకి కోర్టు సమన్లు

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ అధినేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోర్టు సమన్లు జారీ చేసింది. 2015 ఆగష్టు 29న మంగళగిరిలో వైసీపీ నిర్వహించిన బంద్‌కు సంబంధించి ఆళ్లతో సహా పదిహేను మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి నవంబర్ 13న మంగళగిరి కోర్టుకు హాజరు కావాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మంగళగిరి పట్టణంలో బంద్ నిర్వహించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu